🌸 Happy Friendship Day! 🌸
Thanks to friends, our family leads a happy and comfortable life today. Over the years, friends, colleagues, relatives, and even commute mates have become like extended family—always there for us in personal and professional journeys.
I can never speak of friendship without mentioning Vamsi. In 2005, he took a personal risk to bring me into the software industry from KARVY, even assuring financial support until I settled. That one bold step changed my life—and I was lucky to bring my wife Aparna into the same field. Today, both of us are well-settled in ERP. 🙏
In life, it’s important to recognize who’s genuine and who’s not. Choosing the right people to keep in your circle saves time, money, and unnecessary heartache.
Friends can’t replace relatives—but if a relative becomes your true friend, that’s a blessing beyond words. For me, my wife, brother, and daughters are my dearest friends.
I’ll always be grateful to Vamsi and Venu—who helped transform me from an accountant into a software consultant. My life wouldn’t be the same without them. 💛
Here’s to the friends who become family, and the family who become friends. 🫶
#FriendshipDay #Gratitude #LifeJourney #TrueFriends #ERP#Blessed
🌸 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే! 🌸
మా కుటుంబం ఈరోజు సుఖంగా, ఆనందంగా ఉన్నది అంటే, అది స్నేహితుల వల్లే సాధ్యమైంది. కాలక్రమేణా స్నేహితులు, సహోద్యోగులు, ప్రయాణ మిత్రులు, బంధువులంతా మా కుటుంబంలోని భాగంలా మారిపోయారు.
ఈ రోజు వంశీ పేరు లేకుండా నా ఫ్రెండ్షిప్ డే అసంపూర్ణం. 2005లో వంశీ వ్యక్తిగతంగా నాకు హామీ ఇస్తూ, కార్వీ నుంచి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి నన్ను తీసుకొచ్చాడు. "ఇది నీకు సూట్ కాకపోతే నెలకు ₹10,000/- వేరే ఉద్యోగమూ వచ్చే వరకు ఇస్తానని చెప్పి మరీ". వంశీ వల్లే నా జీవితంలో మలుపు మొదలైంది. తరువాత నా భార్య అపర్ణ కూడా అదే రంగంలో స్థిర పడింది . మేమిద్దరం ఇద్దరం ఈరోజు ERPలో సంతోషంగా ఉన్నాం. 🙏
జీవితంలో ఎవరు నిజంగా మనవారో, ఎవరు నటిస్తున్నారో గుర్తించగలిగితేనే మన సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుంది. ఎవరి సంబంధాన్ని కొనసాగించాలో, ఎవరి నుంచి బయటపడాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
స్నేహితులు బంధువుల స్థానాన్ని ఇప్పటికి భర్తీ చేయలేరు... కానీ బంధువు నిజమైన స్నేహితుడైతే అదృష్టంగా భావించాలి. నాకు నా భార్య, తమ్ముడు , కుమార్తెలు నాకు అత్యంత ప్రియమైన స్నేహితులు.
నా జీవితంలో ఎప్పటికీ వంశీ & వేణు పేర్లు నిలిచిపోతాయి. వారు నాకు అకౌంటింగ్ నుండి సాఫ్ట్‌వేర్ దిశగా మారిపోవడానికి తోడ్పడ్డారు. 💛
స్నేహితులు కుటుంబమవ్వడమో, కుటుంబం స్నేహితులవ్వడమో... ఇలాంటి అనుబంధాలు జీవితానికే అర్థం తీసుకొస్తాయి. 🫶
#ఫ్రెండ్షిప్_డే #ధన్యవాదాలు #జీవితయానం #అంతరంగికులు #ERP #Blessed